మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం.. ఎర్రబెల్లి

తెలంగాణ మహా కుంభమేళ అయిన మేడారం జాతర అంగరంగవైభవంగా కొనసాగుతోంది. ఈ జాతరకు జాతీయస్థాయిలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 

minister errabelli dayakar rao comments on medaram jatara

ములుగు : Medaram Maha Jatharaకు జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తామన మంత్రి Errabelli Dayakar Rao అన్నారు. గురువారం మేడారంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం మహాజాతర మీద ముఖ్యమంత్రి KCR ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని తెలిపారు. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కావడం విశేషమన్నారు. 

అమ్మవార్ల ఆశీర్వాదంతో కేసీఆర్ National politicsల్లో రాణించాలని మొక్కుకున్నానని తెలిపారు. ఈ యేడాది జాతరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పూజారులు, ఆదివాసి సంఘాలు సహకారం అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 

కాగా, Medaram Jatharaకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో helicopterసేవలు ప్రారంభం కానున్నాయని ఫిబ్రవరి 15న ప్రకటించారు. Hanumakonda Arts College మైదానం నుంచి జాతరకు హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈనెల మేడారం వెళ్లలేని భక్తులు కూడా మొక్కులు చెల్లించే అవకాశం ఉంది. Courier ద్వారా ప్రసాదం ఇంటిదగ్గరికే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సేవలో రూ.225  చెల్లిస్తే కొరియర్ ద్వారా ప్రసాదం పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫిబ్రవరి 13న తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాస్తున్నామని..  crowd control నియంత్రణకు 33 డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. ముప్పై మూడు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని..  ముప్పై ఏడు చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి రెండు కిలోమీటర్లకు  పోలీస్ ఔట్పోస్టులు ఏర్పాటు చేశామని..  50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. 

ఇదిలా ఉండగా, మేడారం జాతరలో నిన్న విషాదం చోటు చేసుకుంది. జంపన్న వాగులో పడి ఓ రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు.  భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం తిల‌క్ న‌గ‌ర్ కు చెందిన శాద న‌ర్స‌య్య (63) సింగ‌రేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. బుధ‌వారం కుటుంబ స‌భ్యులతో క‌లిసి మేడారం జాత‌ర‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో జంప‌న్న వాగులో స్నానం చేద్దామ‌నుకుని వాగులోకి వెళ్లిన ఆయ‌న ఉన్న‌ట్టుండి బ్యాలెన్స్ త‌ప్పి బ్రిడ్డి కింద ఉన్న గుంత‌ల్లో ప‌డిపోయాడు. దీనిని గ‌మ‌నించిన‌ కుమారుడు అశోక్ తండ్రిని వెంట‌నే బ‌య‌ట‌కు తీసి,  స‌మీపంలోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లాడు. అయితే, ఆయ‌న అప్ప‌టికే మృతి చెందాడ‌నే చేదు వార్త‌ను డాక్ట‌ర్లు కుమారుడికి చెప్పారు. అమ్మవార్లను దర్శించుకోకముందే ఈ విషాదం చోటు చేసుకోవడం అక్కడున్న వారందరినీ కలిచి వేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios