Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: తెలంగాణ అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ మజ్లిస్

తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు  లేఖ ఇవ్వడంతో ఆ పార్టీ బలం ఆరుకు చేరింది. టీఆర్ఎస్ తర్వాత  తెలంగాణ అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్న  పార్టీగా ఎంఐఎం గా రికార్డులకెక్కింది. 

MIM second largest party in telangana assembly after trs
Author
Hyderabad, First Published Jun 6, 2019, 4:43 PM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు  లేఖ ఇవ్వడంతో ఆ పార్టీ బలం ఆరుకు చేరింది. టీఆర్ఎస్ తర్వాత  తెలంగాణ అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్న  పార్టీగా ఎంఐఎం గా రికార్డులకెక్కింది. మరో వైపు భట్టి విక్రమార్కకు విపక్షనేత హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యేలను గెలుచుకొంది. నల్గొండ ఎంపీగా విజయం సాధించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి బుధవారం నాడు రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.  ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి గురువారం నాడు లేఖ ఇచ్చారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో   శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని కూడ టీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేస్తూ ఎంఎస్ ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత తదితరులు శాసనమండలి స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా  శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీకి విపక్షనేత హోదాను రద్దు చేశారు. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖ ఆధారంగా 2018 డిసెంబర్ 22వ తేదీన శాసనమండలిలో విపక్ష హోదా రద్దైంది. ఈ మేరకు నోటిషికేషన్ విడుదలైంది.

ఇదే పద్దతిని తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ అవలంభించింది. ఇవాళ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడంతో  తెలంగాణ అసెంబ్లీలో కూడ ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు కానుంది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ నుండి నోటీఫికేషన్  జారీ చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు వీడడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ బలం అసెంబ్లీలో ఆరుకు పడిపోయింది.అయితే భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య కూడ టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది.

గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌కు 88 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 90కు చేరింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఇవాళ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనానికి లేఖ ఇవ్వడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 103కు చేరింది.  టీడీపీకి1,బీజేపీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు.

సంబంధిత వార్తలు

సీఎల్పీ విలీనం: ధర్నాకు దిగిన భట్టి, శ్రీధర్ బాబు

టీఆర్ఎస్ లోకి గంపగుత్తగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు: స్పీకర్‌కు విలీనం లేఖ

12 మంది ఎమ్మెల్యేలకి కేటీఆర్ విందు: సీఎల్పీ విలీనానికి లేఖ

Follow Us:
Download App:
  • android
  • ios