Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ లోకి గంపగుత్తగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు: స్పీకర్‌కు విలీనం లేఖ

తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని వీలీనం చేస్తున్నట్టుగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం నాడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖను అందించారు

congress mlas submits clp merger  letter to speaker
Author
Hyderabad, First Published Jun 6, 2019, 1:51 PM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని వీలీనం చేస్తున్నట్టుగా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం నాడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖను అందించారు

గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న తర్వాత  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.

 

"

12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ తీర్మానం చేసిన లేఖను స్పీకర్‌ను ఇవ్వనున్నారు.  ప్రగతి భవన్ నుండి మాజీ మంత్రి సబితా రెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, హరిప్రియానాయక్‌లు స్పీకర్‌ను కలిసి లేఖను అందించారు. ఈ లేఖపై 12 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

స్పీకర్‌కు సమర్పించిన వినతిపత్రంలో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, హరిప్రియానాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, జాజుల సురేందర్, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు హర్షవర్ధన్, గండ్ర వెంకటరమణారెడ్డి, వనమా వెంకటేశ్వరరావులు సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు

సీఎల్పీ విలీనం: ధర్నాకు దిగిన భట్టి, శ్రీధర్ బాబు

12 మంది ఎమ్మెల్యేలకి కేటీఆర్ విందు: సీఎల్పీ విలీనానికి లేఖ


 

Follow Us:
Download App:
  • android
  • ios