హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న సమస్యలను బిజెపి, పీడీపీలు బాధ్యత వహించాలని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.  జమ్మూలో చోటు చేుకొన్న పరిణామాలపై మంగళవారం నాడు  ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. 

జమ్మూ కాశ్మీర్‌లో వైఫల్యాల నుండి తప్పించుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రభుత్వంలో బిజెపి భాగంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కాశ్మీర్‌లో ప్రస్తుత  పరిస్థితులకు ఈ రెండు పార్టీలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  శ్రీనగర్ నుండి బిజెపి నేత రామ్‌మాధవ్ ను పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.