ఆ గొప్ప పనికి అసెంబ్లీ కావాల్నా?

ఆ గొప్ప పనికి అసెంబ్లీ కావాల్నా?

ఆ గొప్ప పనికి అసెంబ్లీ కావాల్నా అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ప్రశ్నించారు. ఒకరినొకరు పొగుడుకోవడంలో తప్పులేదు కానీ.. ప్రజా ధనంతో నడిచే అసెంబ్లీలో ఆ పొగడ్తలు అవసరమా అని రేవంత్ ఆ రెండు పార్టీలను ప్రశ్నించారు. సోమవారం పాతబస్తీ లోని గొల్ల కిడికి ప్రాంతంలోని సికింద్రాబాద్  మాజీ ఎంపీ అంజన్ యాదవ్ ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చారు. అంజన్ తనయుడు అనిల్ యాదవ్, చార్మినార్ మాజీ కార్పొరేటర్ గౌస్ లు సాదరంగా పుష్పగుచ్చాలతో ఎదురుకొని రేవంత్ రెడ్డి కి ఆహ్వానం పలుకుతూ ఇంట్లోకి తీసుకెళ్లారు. తదుపరి అంజన్ కుమార్ యాదవ్ రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసి లోనికి ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి అంజన్ ఇంట్లోనే భోజనం చేసి అనేక అంశాలపై ముచ్చటించారు.

అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలన పై  ధ్వజమెత్తారు. ఈ మధ్య కేసీఆర్ అప్పటి నిజాం పాలన పై పొగడ్తలు కొంచం ఎక్కువే చేస్తున్నారని మండిపడ్డారు. ఎం ఐ ఎం కు మరింత దగ్గరయ్యేందుకు కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అలా ప్రయత్నాలు చెయ్యడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఇటు ఎంఐఎం పార్టీ కూడా ఈమధ్య కేసీఆర్ పాలన పై కితాబిస్తూ ఆహా ..ఓహో భేష్ పాలన అంటూ పొగడ్తలు గుప్పించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతదానికి అసెంబ్లీ అవసరమా అని ప్రశ్నించారు.

ఒక వేళ అంతగా ఒకరి నొకరు పొగుడుకోవలనుకుంటే ఇంకోచోట మీటింగ్ పెట్టుకుని రాత్రింబవళ్లు పొగుడుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. ప్రజాధనం ఖర్చు చేసే అసెంబ్లీలో ఈ పొగడ్తలెందుకని నిలదీశారు. అంజన్ కుమార్ యాదవ్ తో అనే అంశాలపై చర్చించానని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుని రానున్న రోజుల్లో తెలంగాణ సర్కారుపై మరింత గట్టిగా ఫైట్ చేస్తానని రేవంత్ తెలిపారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page