హైదరాబాద్: హైద్రాబాద్ లో మెట్రో రైలు రాకపోకల్లో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎక్కడి రైలు అక్కడే నిలిచిపోయాయి.నాగోల్ మెట్రో స్టేషన్ డేటా కంట్రోల్ సిస్టమ్ లో  సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ లోపం కారణంగానే రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 

మూసారాంబాగ్, గాంధీభవన్ మెట్రో స్టేషన్లలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఈ నెల 5వ తేదీన కూడ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. ఎల్బీనగర్ -మియాపూర్, నాగోల్ -రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.  30 నిమిషాలకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. ఉదయం పూట కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

 ఈ నెల 20వ తేదీన కూడ మెట్రో రైలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రైళ్లు నిలిచిపోయాయి.అమీర్‌పేట నుండి జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ కు వెళ్లే మార్గంలో మెట్రో రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది.తరుచూగా హైద్రాబాద్ లో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు.