Asianet News TeluguAsianet News Telugu

మంచినూనె అనుకుని పురుగుల మందుతో వంట.. ఒకరు మృతి...

ఆమెకు మంచినూనె ఏదో పురుగుల మందు ఏదో తెలియలేదు. దీంతో వంట చేసింది. తాను తిన్నది, కూతురు, భర్తకు క్యారేజ్ తీసుకెళ్లింది. మద్యం మత్తులో తిన్న భర్త అస్వస్థత పాలవ్వగా, ఆమె చనిపోయింది. 

mentally unstable woman cooked food with pesticides in khammam
Author
Hyderabad, First Published Aug 13, 2022, 8:00 AM IST

ఖమ్మం : మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ పురుగులమందును మంచినూనె అనుకుంది. పురుగుల మందు పోసి కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తినింది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఠాణాలో శుక్రవారం కేసు నమోదయ్యింది.  పోలీసుల కథనం ప్రకారం.. మేడిద పల్లికి చెందిన బండ్ల నాగమ్మ (37) మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతోంది. 

గురువారం ఉదయం ఇంట్లో మంచి నూనెకు బదులు దాని పక్కనే ఉన్న పురుగుల మందుతో కూర వండింది. ఆ తర్వాత ఆ కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు భోజనం తీసుకు వెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నం తిన్నాడు. మందు వాసన రావడంతో అమ్మాయి అన్నాన్ని పడేసింది. నాగమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

మునుగోడులో కాల్పులు : వివాహేతర సంబంధంతోనే హత్యకు ప్లాన్..తొమ్మిది మంది అరెస్ట్..

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 11న వరంగల్ లో ఇలాంటి మతిస్థిమితం లేని మహిళ కేసే వెలుగులోకి వచ్చింది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన మహిళ(46)కు భర్త, కొడుకు ఉన్నారు. కొడుకు బెంగళూరులో   ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా ఆమెకు పెళ్లి సమయంలో తల్లి తండ్రులు కట్నకానుకల కింద  కొన్ని ఆస్తులు ఇచ్చారు. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు రూ. 15 కోట్లు ఉంటుంది. అయితే, భర్త మరో మహిళను వివాహం చేసుకుని ఈమెను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆస్తిని తన పేరిట మార్చాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే తనకూ ఆస్తిలో భాగం వస్తుందని కొడుకు తండ్రితో చేరిపోయాడు. దీనికి ఆమె అంగీకరించలేదు.

ఆస్తి కోసం భర్త, కొడుకుపెట్టే వేధింపులతో  కొన్నిరోజుల్లోనే ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆమె చనిపోతే ఆస్తిని తమ పేరు మీదికి  మార్పించుకోవచ్చని వారు పన్నానం పన్నారు. 2017లో ఓరోజు ఇద్దరూ దగ్గరుండి ఆమెను రైలెక్కించి ఎక్కడికో పంపించి వేశారు. ఆ తర్వాత ఆమె ఎక్కడో తప్పిపోయిందని బంధువులను నమ్మించారు. భర్త మరో మహిళతో విదేశాలకు వెళ్ళిపోయాడు. రైలెక్కిన ఆమె చెన్నైకి చేరుకుంది. అక్కడ అన్బగం రిహాబిలిటేషన్ సెంటర్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది. ఆమె పాత జ్ఞాపకాలు మరిచిపోయింది. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెకు ఆశ్రయం కల్పించి, వైద్యం చేయించారు. దీంతో ఆమెలో కొంత మార్పు వచ్చినా, గతం గుర్తురాలేదు. 

స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమెకు ఆధార్ కార్డు తీయాలని చెన్నైలోని ఓ ఆధార్ కేంద్రానికి తీసుకువెళ్లింది. అక్కడ వేలిముద్రలు తీస్తుండగా.. అప్పటికే ఆమెకు కార్డు ఉన్నట్లు సాఫ్ట్వేర్ గుర్తించింది.  వెంటనే కార్డు తీసుకొని వివరాలు సేకరించగా హనుమకొండ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. చిరునామాలో సంప్రదించేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు అందుబాటులోకి రాకపోవడంతో హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పంపిన ఫోటో తో మహిళ కుమారుడు వద్దకు వెళ్లారు. ఆమె ఫొటో చూపించి మీ తల్లేనా అని ప్రశ్నించారు. తన తల్లి ఎప్పుడో చనిపోయిందంటూ.. మరణ ధ్రువీకరణ పత్రం తన వద్ద ఉందని బుకాయించాడు కొడుకు. దీంతో లోతుగా విచారిస్తే వారి కుట్ర బయట పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios