Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో కాల్పులు : వివాహేతర సంబంధంతోనే హత్యకు ప్లాన్..తొమ్మిది మంది అరెస్ట్..

మునుగోడులో కలకలం సృష్టించిన  కాల్పుల కేసులో పోలీసులు తొమ్మిదిమందిని అరెస్ట్ చేశారు. ఈ కాల్పులకు వివాహేతర సంబంధమే కారణం అని తేలింది. 

extra marital affair caused on firing on a man in Munugode, nalgonda
Author
Hyderabad, First Published Aug 13, 2022, 7:20 AM IST

నల్గొండ : రాజకీయంగా హాట్ టాపిక్ గామారిన మునుగోడులో.. కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తుపాకీతో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం రేపింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా Supariతో పాటు తుపాకి కల్చర్ వెలుగులోకి రావడంతో అన్ని వర్గాల వారు ఉలిక్కిపడ్డారు. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో నిమ్మలస్వామిపై ఈ నెల 4న జరిగినహత్యా యత్నం కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు.  నిందితుల నుంచి ఒక పిస్టల్, 9 ఫోన్ లు, రూ.4,500 నగదు, ప్రామిసరీ  నోట్లు, రెండు బ్యాంక్ చెక్ బుక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.

మర్రిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాదులోని వనస్థలిపురంలో ఉంటున్న నార్కట్పల్లి మండలం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో మిడ్ డే మీల్స్ వర్కర్ గా పని చేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆమె భర్త నిమ్మల స్వామిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. దీనికోసం ముందుగా యాచారం మండలం మాల్ ప్రాంతానికి చెందిన రామస్వామితో మూడు లక్షల రూపాయలకు సుపారీ కుదుర్చుకున్నారు.  

మునుగోడులో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు..

అడ్వాన్స్ గా రూ.1.70లక్షలు తీసుకున్న రామస్వామి  మునుగోడు నిమ్మలస్వామి దుకాణం పక్కనే మరో దుకాణం అద్దెకు తీసుకుని అందులో పనిచేస్తున్న మొహినుద్దీన్ తో పరిచయం పెంచుకున్నాడు.  దీంతో చింతపల్లి మండలం ఇంజమూరు గ్రామానికి చెందిన పోల్ గిరి,  రత్నాల వెంకటేష్ లతో కలిసి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బాలకృష్ణ అంతటితో ఆగకుండా మరోసారి హైదరాబాద్ లో ప్లంబర్లు గా పనిచేస్తున్న యూసుఫ్ తో కలిసి పథకం వేసి రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  ఈసారి రూ. ఐదు లక్షలు  సుపారీ ఇచ్చాడు. యూసుఫ్  తన  స్నేహితుడు జహంగీర్  పాష, ఆసిఫ్ ఖాన్ లు కలిసి అప్పటికే బీహార్లో పిస్టల్ కొనుగోలు చేసుకుని ఉన్న అబ్దుల్ రెహమాన్ తో కలిసి ఈ నెల 4న స్వామిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వీరిలో యూసుఫ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇదిలా ఉండగా, మునుగోడులో ఆగస్ట్ 4న టూవీలర్ మీద వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు మరో బైక్ పై వెంబడించి.. వెనుక  వైపు నుంచి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ  ఘటన నల్గొండ జిల్లాలో భయాందోళనలు రేపింది. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో ఆగస్ట్ 3 రాత్రి ఇది చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన  నిమ్మల లింగస్వామి (32) మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల్స్ వ్యాపార్ం చేస్తుంటాడు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తూ బ్రాహ్మణ వెల్లంపల్లిలో ఉంటున్నాడు. రోజువారీగా దుకాణం మూసేసి టూ వీలర్ పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో లింగస్వామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios