డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కి నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్ట్ అనుమతి

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు డాక్టర్ సైఫ్‌కి న్యాయస్థానం 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 

warangal court allows 4 days police custody for saif in doctor preethi suicide case

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా నిందితుడు సైఫ్‌ను 4 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తికి వరంగల్ కోర్ట్ సానుకూలంగా స్పందించింది. దీనిలో భాగంగా రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సైఫ్‌ను కస్టడీకి అనుమతించింది కోర్ట్. దీంతో గురువారం అతనిని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. 

అంతకుముందు డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈరోజు విచారణ జరిపింది. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ సైఫ్ ర్యాగింగే కారణమని తేల్చింది కమిటీ. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ వ్యవహారం ర్యాగింగ్ కిందకే వస్తుందని తెలిపింది. అందుకే సైఫ్ వేధింపులను ర్యాగింగ్‌గానే నిర్ధారించినట్లు కమిటీ పేర్కొంది. మానసిక వేధింపులు కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందని కమిటీ వెల్లడించింది. అయితే ప్రీతిని భౌతికంగా వేధించినట్లు ఆధారాలు లేవని కమిటీ అధ్యక్షుడు, కేఎంసీ ప్రిన్సిపాల్ అంటున్నారు. 

ALso REad: సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య.. ఆ టార్చర్ ర్యాగింగ్ కిందకే : తేల్చేసిన యాంటీ ర్యాగింగ్ కమిటీ

ఇకపోతే.. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనతి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. అతని సెల్‌ఫోన్‌లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనూష, భార్గవి, LDD+Knockouts గ్రూప్ చాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగం ప్రీతికి సూపర్‌వైజర్‌గా సైఫ్ వ్యవహరిస్తున్నాడు. రెండు ఘటనల కారణంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 

ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది ప్రీతి. అయితే వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి రాసిన రిపోర్టును హేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు సైఫ్. అయితే తనతో ఏమైనా ప్రాబ్లమ్ వుంటే హెచ్‌వోడీకి చెప్పాలని సైఫ్‌కు ప్రీతి వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రీతిని వేధించాలని భార్గవ్‌కు చెప్పాడు సైఫ్. అంతేకాకుండా ఆర్‌ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. ఈ వేధింపుల నేపథ్యంలో ఫిబ్రవరి 21న హెచ్‌వోడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్లు మురళీ, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్‌లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios