మేడ్చల్:  మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లారు.కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు ఏసీబీ విచారణలో మరికొందరు తహాసీల్దార్లతో పాటు కలెక్టర్ పేరు కూడ చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

also read:నాగరాజు అక్రమాస్తుల కేసులో ట్విస్ట్: వెలుగులోకి కలెక్టర్, ఆర్డీవో, మరో ఎమ్మార్వోల పాత్ర

మేడ్చల్ జిల్లాలో కీసర తహాసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.  ఈ కేసులో మరికొందరి పేర్లను కూడ ఏసీబీ అధికారుల విచారణలో నాగరాజు వెల్లడించినట్టుగా తెలిసింది. 

also read:రూ.1.10 కోట్ల లంచం తీసుకొన్న కీసర తహసీల్దార్ నాగరాజు: గిన్నిస్ బుక్ ‌రికార్డ్స్‌లో చోటుకు ధరఖాస్తు

ఉద్దేశ్యపూర్వకంగానే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవిన్యూ అధికారులు ప్రకటించారు. విచారణ సమయంలో నాగరాజు మేడ్చల్ కలెక్టర్ పేరును కూడ చెప్పారని మీడియాలో వార్తలు రావడాన్ని ఆయన ఖండించారు.ఈ విషయం వెలుగులోకి రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లాడు. 

కీసర తహాసీల్దార్ వ్యవహరం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నాగరాజు తో పాటు ఆయనకు సహకరించిన వారు నోరు మెదపని కారణంగా మరోసారి నాగరాజును కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది.