కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో నిందితుల కస్టడీ వాంగ్మూలం తీసుకుంది ఏసీబీ దీనిలో కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహసీల్దార్ పేర్లు బయటకు వచ్చాయి.

వరంగల్ జిల్లా హన్మకొండ తహశీల్దార్ కిరణ్ ప్రకాశ్ ద్వారానే ఆర్డీవో రవితో ఒప్పందం జరిగినట్లు ఏ 3 శ్రీనాథ్ చెప్పాడు. ఇక 61 ఎకరాల 20 కుంటల భూమి విషయంలో నాగరాజును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

వీఆర్‌వో సాయిరాజు, అంజిరెడ్డిల ద్వారానే అగ్రిమెంట్ కుదిరినట్లు శ్రీనాథ్ చెప్పుకుంటూ వచ్చాడు. మొయినుద్దీన్ మరో 37 మంది భూమి అగ్రిమెంట్లు చేసినట్లు సాయిరాజ్ వాంగ్మూలం ఇచ్చాడు.

Also Read:మామూలోడు కాడు: కీసర మాజీ తాహిసిల్దార్ కేసులో సంచలన విషయాలు

కలెక్టర్‌తో భూమిని మ్యూటేషన్ చేయించే బాధ్యత ఆర్డీవో, తహశీల్దార్ చూసుకుంటామన్నారని కోటి 10 లక్షల నగదును వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పాడు. మరోవైపు కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతోనే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్‌హౌస్‌కు వెళ్లినట్లు నాగరాజు చెప్పారు.

అయితే శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదన్నారు. అయితే తహసీల్దార్ నాగరాజు విచారణలో తమకు ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ చెబుతోంది. ఇంట్లో దొరికిన లాకర్ కీ, డాక్యుమెంట్లు, చెక్కులపై నాగరాజు నోరు మెదపలేదని ఏసీబీ వెల్లడించింది.