Asianet News TeluguAsianet News Telugu

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తేదీలు ఇవే..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022 ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. 

medaram maha jathara 2022 dates ksp
Author
Hyderabad, First Published Apr 25, 2021, 3:08 PM IST

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022 ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు.

తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. 

ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.

ఈ పండగను 2014లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios