హైదరాబాద్ లో దారుణం జరిగింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎంబీఏ విద్యార్థిని స్టేషన్ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అమీర్ పేట : ఈఎస్ఐ metro stationపై నుంచి దూకి ఎంబీఏ విద్యార్థిని suicide attemptకు పాల్పడినట్లు ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. బోరబండ శ్రీరామ్ నగర్ సమీపంలోని సంజయ్ నగర్ కు చెందిన విద్యార్థిని (22) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. తండ్రికి ఆటో మొబైల్ దుకాణం ఉంది. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కూతురు ఫోన్ లో chatting చేస్తుండగా తల్లిదండ్రులు మంగళవారం మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె సాయంత్రం ఐదున్నర గంటలకు ఈఎస్ఐ మెట్రో స్టేషన్ కు చేరుకుంది. స్టేషన్ మొదటి అంతస్తు పై నుంచి ఈఎస్ఐ ఆస్పత్రి వైపు కిందకు దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మెట్రో స్టేషన్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం..
మెట్రో స్టేషన్ పై నుంచి ఎంబీఏ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో ఎలాంటి హైదరాబాద్ సంస్థ అధికారులతో చర్చిస్తామని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా మెట్రో స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నామని వివరించారు.
ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ 12న ఇలాంటి ఘటనే ఇదే మెట్రో స్టేషన్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సదరు యువతి మెట్రో స్టేషన్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించి .. పక్కనే ఉన్న టింబర్ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని యువతికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు.
