ఎంబీఏలో గోల్డ్ మెడల్.. 200 దొంగతనాలు చేసి.. పోలీసులకు చిక్కిన క్యాబ్ డ్రైవర్...

ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాడు. దొంగతనాల్లో పీహెచ్డీ చేద్దామనుకున్నాడేమో.. ఓ వ్యక్తి చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఏకంగా 200 దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కాడు. 

MBA gold medalist thief ,Cab driver caught by police In hyderabad

హైదరాబాద్ : ఎంబీఏలో బంగారు పతకం సాధించాడు... ఇంకేంటీ.. చక్కగా మంచి ఉద్యోగం సాధించి.. జీవితంలో స్థిరపడ్డాడనుకున్నారా? అయితే మీరు పొరపడ్డట్టే.. బంగారు పతకం సాధించిన చేతులతోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. క్యాబ్ డ్రైవర్గా వృత్తిని ఎంచుకున్నాడు. ఇళ్లల్లో చోరీలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 వరకు దొంగతనాలు చేశాడు. ఈ నేరాలు చేసే క్రమంలో పలుసార్లు జైలుకెళ్లి వచ్చాడు. అయినా తీరు మార్చుకోలేదు. చదివిన చదువుకు ఎంచుకున్న వృత్తికి, చేస్తన్న ప్రవృత్తికి ఏం పొంతనలేదు అని ఆలోచిస్తున్నారా? నిజమే మరి.. 

తాజాగా మరో కేసులో హైదరాబాదులోని గాంధీ నగర్ పోలీసు లకు చిక్కాడు. ఇన్స్పెక్టర్ మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీ కృష్ణ అలియాస్ లోకేష్ అలియాస్ రిచర్డ్ నగరంలో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. గత నెలలో కవాడిగూడలోని  ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు నగలు, మూడు లక్షల రూపాయల నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. 

నిజామాబాద్ లో ఉగ్రలింకుల కలకలం: పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్

జల్సాల కోసం..
వంశీకృష్ణ బాగా చదువుతాడు. చాలా చురుకైన మనిషి. 2004లో ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఉద్యోగం చేయడం.. దాంట్లో వచ్చే జీతం డబ్బులు సరిపోవనిపించింది. అందుకే సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం దొంగతనాలే బెస్ట్ ఆప్షన్ అని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవాడు. అలా ఇళ్లు దొరికితే గప్ చిప్ గా దొంగతనం చేసి మాయమయ్యేవాడు. ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. 

డబ్బు ఖర్చవ్వగానే.. మళ్లీ దొంగతనానికి పాల్పడేవాడు. అలా.. హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోనూ చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడేవాడు. 2006 నుంచి ఇప్పటివరకు అలా 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు. వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిమీద పోలీసులు రెండుస్తారు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. అయినా తీరు మారలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios