Asianet News TeluguAsianet News Telugu

Matrimony Fraud : పెళ్లి కొడుకు నచ్చలేదన్నందుకు.. కక్ష పెంచుకున్న యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే...

తనను రిజెక్ట్ చేసిందని యువతి మీద  కక్ష పెంచుకున్నాడు. ఆ తరువాత సాయికుమార్ facebookలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యువతి ఫొటోలు, ఫోన్ నంబర్ ను పెట్టి అసభ్యకరంగా పోస్టులు చేయసాగాడు.

Matrimony Fraud : man harassed women over not accepting marriage
Author
Hyderabad, First Published Nov 5, 2021, 11:42 AM IST

పీర్జాది గూడ : మ్యాట్రిమోనియల్ మోసాలు రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఫేక్ ఐడెంటిఫికేషన్ తో మోసం చేసేవారు కొంతమంది అయితే... సంబంధం బాగుందని ఆశ పడ్డ తరువాత అనేక రకాల కారణాలతో అందిన కాడికి డబ్బులు దండుకుని బయటపడేవారు మరికొందరు. 

ఎటు తిరిగీ ఇలాంటి మోసాల్లో అధిక శాతం అమ్మాయిలే బలవుతుంటారు. అయితే తాజాగా మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. సంబంధం కుదుర్చుకుని.. పెళ్లి చూపుల దాకా వచ్చిన తరువాత పెళ్లి కూతురు ఫ్యామిలీ చెప్పిన మాటతో... ఓ యువకుడిని కోపం వచ్చింది. దీంతో దారుణానికి తెగబడ్డాడు. 

ఉప్పల్, పీర్జాది గూడలో సోషల్ మీడియాలో యువతిని వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మక్బూల్ కథనం ప్రకారం.. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఆమెకు వివాహం చేయాలని ఇంట్లో వాళ్లు నిర్ణయించడంతో... ఆమె మాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుంది. 

కాగా, నెల్లూరుకు చెందిన సాయికుమార్ (29) కూడా software ఉద్యోగే. matrimonyలో ఆమె  ఫొటోను చూశాడు. ఆమె ఫ్రొఫైల్ నచ్చడంతో అతడు తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకు యువతి ఇంటికి వచ్చారు. పెళ్లి చూపుల తరువాత అమ్మాయి తల్లిదండ్రులకు యువకుడు నచ్చలేదు. అదే విషయాన్ని యువతి కుటుంబ సభ్యులు అబ్బాయి వారికి తెలిపారు.

విషయం తెలిసి సాయికుమార్ షాక్ అయ్యాడు. తనను రిజెక్ట్ చేసిందని యువతి మీద  కక్ష పెంచుకున్నాడు. ఆ తరువాత సాయికుమార్ facebookలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యువతి ఫొటోలు, ఫోన్ నంబర్ ను పెట్టి అసభ్యకరంగా పోస్టులు చేయసాగాడు.
ఈ విషయం తెలిసిన యువతి దిగ్బ్రాంతికి గురైంది. మానసికంగా చాలా వేదనకు గురైంది. 

యువకుడి చర్యలు ఆగకపోతుండడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం సాయికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

Matrimony Fraud : వితంతువులు, ఒంటరి మహిళలే టార్గెట్.. ఘరానా మోసగాడు అరెస్ట్..

బహుమతుల పేరుతో టోకరా....
ఇలాంటిదే మరో మోసం గత ఆగస్ట్ లో జరిగింది. వివాహం కోసం తన ప్రొఫైల్ ని క్రిస్టియన్ మ్యాట్రిమోనిలో అప్ లోడ్ చేసిన యువతికి భారీ టోకరా వేశాడు సైబర్ నేరగాడు. తాను యూకేలో జనరల్ ఫిజీషియన్ అంటూ హైదరాబాద్ అదర్శనగర్ కు చెందిన నర్సు నాగమణికి ఇటీవల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 

నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా చేస్తున్నానంటూ ఈమె పరిచయం పెంచుకుంది. ఇద్దరి మధ్య రోజు రోజుకు మాటలు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్ లోనే ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని నాగమణిని నమ్మించాడు. డిసెంబర్ నాటికి భారత్ కు వస్తున్నానని, అయితే ఈలోపు మన ప్రేమ గుర్తుగా కొన్ని ఖరీదైన వస్తువులు పంపుతానన్నాడు. 

రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ నాగమణికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు యూకే నుంచి ఖరీదైన గిఫ్ట్ లు వచ్చాయని, వాటిని సొంతం చేసుకోవాలంటే ఛార్జీస్ చెల్లించాలన్నాడు. గుడ్డిగా నమ్మిన నాగమణి పలు దఫాలుగా రూ.5లక్షలు నగదును ట్రాన్స్ ఫర్ చేసింది. 

డబ్బు చేతికి అందినాక ఫోన్ మాట్లాడటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఆరా తీయగా.. అది ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని ఇరుగు పొరుగు వారు చెప్పాడు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios