Asianet News TeluguAsianet News Telugu

Matrimony Fraud : వితంతువులు, ఒంటరి మహిళలే టార్గెట్.. ఘరానా మోసగాడు అరెస్ట్..

వివిధ మ్యాట్రిమోని సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వితంతువు, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులతో ఉడాయించడం కిరణ్ ప్రత్యేకత. ఇదే విధంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను మోసం చేసి వారి నుంచి నగదు, డబ్బు తీసుకుని పారిపోయి ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకున్నాడు. 

Matrimony Fraud : hyderabad police arrested imposter kiran kumar reddy  in tirupati
Author
Hyderabad, First Published Oct 1, 2021, 9:50 AM IST

హైదరాబాద్ : ఒంటరి మహిళలను (Single Women) లక్ష్యంగా చేసుకుని పెళ్లి (Marriage Fraud) చేసుకుంటానని మాయమాటలు చెబుతాడు వారు నమ్మినట్టు కనిపించాక ఏదో ఒక కారణంతో అందినకాడికి దండుకుని పారిపోతాడు. ఈ ఘరానా మోసగాడు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్ కుమార్ రెడ్డి (29) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. 

ఫిర్యాదు, నమోదవడం.. ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో సైబరాబాద్ పోలీసులు ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరించాడు. దీంట్లో  నిందితుడు తిరుపతిలో తల దాచుకున్నాడని తెలుసుకుని అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

కిరణ్ తో పాటు ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఇప్పటివరకు ఎంతమంది మహిళలను ఇలా మోసం చేశాడు?ఎంత డబ్బులు కాజేశాడు వంటి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నలుగురు పోలీసు సభ్యుల బృందం ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నట్లు తెలిసింది. 

హైద్రాబాద్‌లో దారుణం: అన్న కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు, బాలిక మృతి

వివిధ మ్యాట్రిమోని సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వితంతువు, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులతో ఉడాయించడం కిరణ్ ప్రత్యేకత. ఇదే విధంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను మోసం చేసి వారి నుంచి నగదు, డబ్బు తీసుకుని పారిపోయి ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకున్నాడు. 

ఈ మోసగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆగస్ట్ 22న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టుంచుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించింది. అయినా పోలీసుల విచారణ ముందుకు సాగకపోవడంతో అవమానం, ఒత్తిడి తట్టుకోలేక ఆ అభాగ్యురాలు సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు వెంటనే కేసును సీరియస్ గా తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios