Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతికి స్వంత ఊళ్లకు జనం: పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

సంక్రాంతిని పురస్కరించుకొని  స్వంత ఊళ్లకు జనం వెళ్తున్న నేపథ్యంలో  హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

 Massive Traffic Jams on Highways leading to Andhra Pradesh lns
Author
First Published Jan 12, 2024, 9:42 AM IST


హైదరాబాద్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  హైద్రాబాద్ నుండి స్వంత ఊర్లకు  జనం  బయలు దేరారు. దీంతో  యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం  పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.

ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని  హైద్రాబాద్ లో నివాసం ఉన్న  వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తమ స్వంత ఊర్లకు వెళ్తుంటారు .దీంతో యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద  పెద్ద ఎత్తున వావానాల రద్దీ కొనసాగుతుంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు  పోలీసులు.  కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ ఫీజు చెల్లించే సమయంలో  టోల్ గేటు వద్ద  నిమిషాల పాటు  వాహనాలు నిలిచిపోకుండా టోల్ ప్లాజా యాజమాన్యం కూడ చర్యలు తీసుకుంటుంది. 

హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతిని పురస్కరించుకొని  వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని  అధికారులు  భావిస్తున్నారు.ఈ మేరకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతిని పురస్కరించుకొని కోడిపందెలు కూడ నిర్వహిస్తారు. ఈ కోడిపందెలను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడ పెద్ద ఎత్తున  ప్రజలు వస్తుంటారు. మూడు రోజుల పాటు పండుగను జరుపుకొనేందుకు  స్వంత ఊర్లకు  ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున  వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

also read:లావుకు మద్దతుగా జగన్ వద్దకు: మార్చొద్దని కోరుతున్న నలుగురు ఎమ్మెల్యేలు

రానున్న రెండు మూడు రోజుల్లో  వాహనాల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  దీన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్లపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు  చర్యలు చేపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios