తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఉగ్రవాది అస్గర్ అలీ జైలుకు వెళ్లినప్పటికీ అతని బుద్ధి మాత్రం మారడం లేదు. బెయిల్‌పై తిరిగొచ్చిన తర్వాత కూడా మళ్లీ సెటిల్‌మెంట్లు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.

నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన అస్గర్ స్థానికంగా సెటిల్‌మెంట్లు, గంజాయి అక్రమ రవాణాతో పాటు కిరాయి హత్యలు చేసేవాడు. ఈ క్రమంలో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యేవాడని చెబుతారు.

గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యను హత్య చేశాడు. ఆ తర్వాత మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్‌ని హత్య చేశాడు. ఈ హత్యకేసులో పట్టుబడి ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

జూలై 3న బెయిల్‌పై విడుదలైన అతను ... సెటిల్‌మెంట్లు మొదలుపెట్టడంతో పాటు ప్రణయ్ హత్యలో ఒప్పందం ప్రకారం రావాల్సిన డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తానంటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీ, అమృత తండ్రి మారుతీరావులను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో హరేన్ పాండ్యా హత్య కేసులో అస్గర్ అలీకి సుప్రీంకోర్టు జీవితఖైదు విధించడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతనిపై  నిఘావర్గాలు, జాతీయ దర్యాప్తు సంస్థ నిఘా పెట్టడంతో ఇటీవల నల్గొండలో ఒక స్థలానికి సంబంధించిన సెటిల్‌మెంట్ చేస్తూ పోలీసులకు చిక్కాడు.

విచారణలో భాగంగా అస్గర్ పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో 20 రోజుల పాటు కస్టడీలో ఉంచుకున్నారు.

అయితే హరేన్ పాండ్యా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అస్గర్ అలీని గుజరాత్‌ పోలీసులకు అప్పగించాల్సిందిగా అహ్మదాబాద్ కోర్ట్ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో అతనిని గుజరాత్ తీసుకెళ్లిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు.. హరెన్ పాండ్యా హత్య కేసులో దోషి

ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్