వరంగల్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల విడుదల నిలిచిపోయింది. శుక్రవారం హైకోర్టు ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితులైన మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీంలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

సాక్ష్యాలను ప్రభావితం చేస్తే వెంటనే బెయిల్ రద్దు చేస్తామంటూ ప్రకటించింది. అయితే జైలు అధికారులకు బెయిల్ పేపర్స్ అందకపోవడంతో ప్రణయ్ హత్య కేసు నిందితుల విడులను నిలిపివేశారు వరంగల్ జైలు అధికారులు. బెయిల్ పేపర్లు వస్తే ఆదివారం నిందితులు విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇకపోతే ప్రణయ్ హత్య కేసులో నిందితులు బెయిల్ మంజూరు కావడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రణయ్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తన మావయ్య ఉద్యోగ రీత్యా బయట తిరగాల్సిన అవసరం ఉందని, అలాగే తనకు తన కుమారుడుకు ప్రాణహాని ఉందని అమృత ఆరోపిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని తమకు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేస్తూ అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామిలు డీఎస్పీ శ్రీనివాస్ ని కలిశారు. 

ఈ వారంలోనే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిందితులు సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే బెయిల్ రద్దుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అమృత కుటుంబానికి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత