హైదరాబాద్: ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఇద్దరు వీర జవాన్లు అంత్యక్రియలు బుధవారం నాడు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మచిల్ సెక్టార్ లో ఆదివారం నాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని  వేల్పూరు మండలంలోని కోమన్ పల్లి గ్రామానికి చెందిన మహేష్ కూడ మృతి చెందాడు.

also read:ఉగ్రవాదుల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మహేష్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

వీరిద్దరి అంత్యక్రియలను  ఇవాళ వారి స్వగ్రామాల్లో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లిలో మహేష్ అంత్యక్రియలను సైనిక లాంఛనాల మధ్య పూర్తి చేశారు. 
ఆర్మీ జవాన్ కు తుది వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున  జనం తరలివచ్చారు.  

ఏడాది క్రితమే  మహేష్ పెళ్లి చేసుకొన్నాడు. ఇక ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలను  బుధవారం నాడు స్వగ్రామంలో నిర్వహించారు. 

ప్రవీణ్ కుమార్ పార్ధీవ దేహాన్ని చూసేందుకు భారీగా స్థానికులు వచ్చారు. ప్రవీణ్ కుమార్ భౌతిక కాయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సందర్శించి నివాళులర్పించారు.