నిజామాబాద్: ఉగ్రవాదుల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మహేష్ కుటుంబసభ్యులను తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించారు.

ఆదివారం నాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మహేష్ మరణించాడు. నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లిలో మహేష్ కుటుంబసభ్యులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు.

also read:కుటుంబంతో మహేష్ చివరగా మాట్లాడిన మాటలు ఇవే..

అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారంతో బీఎస్ఎఫ్, ఆర్మీ దళాలు జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో సోదాలు జరుపుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఘటనలో మహేష్ మరణించాడు. 

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకొన్నారు.కోమన్ పల్లిలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు హైద్రాబాద్ లోని ఆర్మీ కార్యాలయ అధికారులతో మంత్రి  మాట్లాడారు.

మహేష్ కుటుంబాన్ని ఆదుకొంటామని  మంత్రి తెలిపారు. మహేష్ చిత్రపటానికి  మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎష్పీ కార్తికేయలు నివాళులర్పించారు.

రేపు సాయంత్రానికి హైద్రాబాద్ కి మహేష్ పార్థీవ దేహం రానుంది. ఎల్లుండి మహేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏడాది క్రితమే మహేష్ ప్రేమ పెళ్లి చేసుకొన్నాడు. మచిల్ సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు జవాన్లు, ముగ్గురు తీవ్రవాదులు మరణించారు.