నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడే కట్నం కావాలంటూ వేధించడాన్ని తట్టుకోలేకపోయిన నవవధువు బలవన్మరణానికి పాల్పడింది.  

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కేతెపల్లి మండలం కొర్లపహాడ్‌ కు చెందిన యువతి సూర్యాపేటకు చెందిన ప్రణయ్ ను ప్రేమించింది. వీరిద్దరూ ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లియిన తర్వాత కొన్నాళ్లు బాగానే వున్న ప్రణయ్ ఆ తర్వాత తన అసలురూపాన్ని బయటపెట్టాడు. 

పెళ్లి సమయంలో కట్నం ఇవ్వలేదని... ఇప్పుడు తనకు కట్నం కావాలంటూ వేధించడం ప్రారంభించాడు. ఇలా ప్రేమించిన వాడే కాసుల కోసం కష్టాలు పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన వివాహిత దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగిన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.