అర్థరాత్రి ఒంటరి మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం : సాయం చేస్తానని నమ్మించి

married Woman Raped by Auto Driver
Highlights

హైదరాబాద్ బాచుపల్లి లో దారుణం

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి అత్యవసర మందులు తీసుకురావడానికి అర్థరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఓ వివాహితపై లైంగిక దాడి జరిగింది. సాయం చేస్తానని నమ్మించిన ఓ ఆటోడ్రైవర్ ఆమెను ఆటోలో ఎక్కించుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆ మహిళ పోలీసుల సాయంతో అతడి దగ్గరి నుండి బైటపడింది. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ అత్యాచార సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పరుశురాం(25)  దుండిగల్ సమీపంలోని బౌరంపేటలో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే నిన్న అర్థరాత్రి ఇతడు ఫుల్లుగా మద్యం తాగి ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రగతినగర్‌కు చెందిన యువతి(20) అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మందులు తీసుకెళ్లేందుకు ఇతడి ఆటోలో ఎక్కింది. మహిళ ఒంటరితనాన్ని అదునుగా తీసుకుని ఈ కామాంధుడు ఆబెను నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే అతడు అంతటితో ఆగకుండా ఆటోలో మరెక్కడికో తీసుకుపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అటువైపుగా పెట్రోలింగ్ కు వస్తున్న పోలీసు వాహనాన్ని గమనించిన ఆమె కాపాడమంటూ అరిచింది.దీంతో పోలీసులు ఆమె ఏదో అపాయంలో ఉందని గుర్తించి ఆటోను చేజ్ చేసి పట్టుకున్నారు. 

జరిగిన  అఘాయిత్యంపై బాధితురాలు పోలీసులకు తెలపడంతో పాటు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 
 

loader