తెలంగాణ- ఛత్తీస్‌గడ్ బోర్డర్‌లో మావోల అలజడి: పోలీసుల టార్గెట్‌గా మందుపాతర.. ఒకరికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (bhadradri kothagudem) తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో (telangana chhattisgarh border) మావోయిస్టులు (maoists) కలకలం సృష్టించారు. బుధవారం చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను (landmine) పేల్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (bhadradri kothagudem) తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో (telangana chhattisgarh border) మావోయిస్టులు (maoists) కలకలం సృష్టించారు. బుధవారం చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను (landmine) పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐ గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
Also Read:Maoists: వారం రోజుల తర్వాత సబ్ ఇంజనీర్‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు
ఇక ఇటీవలి కాలంలో పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నక్సల్స్ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో ధీటుగా జవాబిస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాల కూంబింగ్ కొనసాగుతూనే వుంది. దీనితో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే పోలీసులను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.