హైదరాబాద్: మావోయిస్టు నేత గడ్డం మధుకర్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నెల 2వ తేదీన మధుకర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  ములుగులో పోలీసులకు చిక్కాడు. మధుకర్ తో పాటు ఆయన కొరియర్  ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో బాధపడుతున్న  మధుకర్ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు.

also read:'12 మంది అగ్రనేతలకు కోవిడ్': కరోనా చికిత్సకు వచ్చి వరంగల్ పోలీసులకు చిక్కిన మావోయిస్టు

మధుకర్ తో పాుట అడవిలో ఉన్న 12 మంది మావో అగ్రనేతలు కూడ  కరోనాతో ఇబ్బందిపడుతున్నారని మధుకర్ పోలీసుల విచారణలో చెప్పాడని వరంగల్ సీపీ  తరుణ్ జోషీ ప్రకటించారు. లొంగిపోతే మావోయిస్టులకు చికిత్స అందిస్తామని తరుణ్ జోషీ తెలిపారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కూడ పలవురు మావోయిస్టులు కరోనాతో బాధపడుతున్నారని ఛత్తీస్‌ఘడ్ పోలీసులు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మధుకర్‌పై ప్రభుత్వం రూ. 8 లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.పోలీసుల విచారణలో మావోయిస్టు అగ్రనేతలు కటకం సుదర్శన్, తిప్పిరి తిరుపతి, యాపా నారాయణ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్  లు కరోనా బారినపడినట్టుగా మధుకర్ తమకు విచారణలో మధుకర్ చెప్పాడని తరుణ్ జోషీ ఇటీవల ప్రకటించారు.