హైద్రాబాద్ హయత్ నగర్ లో  మావోయిస్టు  దంపతులను  ఇవాళ  పోలీసులు  అరెస్ట్  చేశారు. మహరాష్ట్రంలో  పలు దాడుల కేసులతో  మావోయిస్టు దంపతులకు  సంబంధం ఉందని  పోలీసులు  చెప్పారు.

హైదరాబాద్:  నగర శివారులోని  హయత్ నగర్ లో మావోయిస్టు నేత మధుకర్ , అతని భార్య  శ్యామలను పోలీసులు  సోమవారం నాడు అరెస్ట్  చేశారు. 2005 లో  మహారాష్ట్రలోని గడ్చిరోలి నుండి   మధుకర్ , అతని భార్య  శ్యామల  హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్  హయత్ నగర్ లో  నివాసం ఉంటున్నారు.  నగరంలోని  ఓ ట్రావెల్స్  సంస్థ వద్ద  మధుకర్  సెక్యూరిటీ గార్డుగా  పనిచేస్తున్నాడు.  అతని భార్య శ్యామల  ప్రముఖ బట్టల షోరూమ్ లో  సేల్స్ ఉమెన్ గా పనిచేస్తుంది.   సోమవారం నాడు  మధుకర్ , అతని భార్య శ్యామలను పోలీసులు అరెస్ట్  చేశారు.  వీరిద్దరిని  అరెస్ట్  చేసి  మహరాష్ట్రలోని గడ్చిరోలికి తరలించారు. 

పలు దాడులతో  మధుకర్ దంపతులకు  సంబంధం  ఉందని  పోలీసులు  చెప్పారు. తమ ఉనికి తెలియకుండా  మావోయిస్టు దంపతులు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా  పోలీసులు  చెప్పారు. మావోయిస్టు మధుకర్ దంపతులపై  రూ. 10 లక్షలకు పైగా రివార్డులున్నట్టుగా  పోలీసులు  చెప్పారు.