హాట్‌హాట్‌గా కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చ: రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జానా
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో తీవ్ర చర్చ సాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంపైనే నేతలు తీవ్రంగా చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. Huzurabad bypoll ఓటమికి సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చసాగింది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3 వేల ఓట్లు దక్కాయి. Congress పార్టీకి 3 వేల ఓట్లు దక్కడంపై ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు.గాంధీ భవన్ లో బుధవారం నాడు Congress Political Affairs Committee సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చ సాగింది.
also read:అందరికీ శతృవయ్యా, 2023 వరకు పార్టీ వ్యవహరాలపై మాట్లాడను: జగ్గారెడ్డి
ఈ ఉపఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే Revanth Reddy ఈ ప్రకటన చేశారు.ఈ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత Jana Reddy తప్పుబట్టారు.
పార్టీ ఓటమికి నీవు ఒక్కడితే బాధ్యత ఎలా అవుతుందని జానారెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదంతా సమిష్టి బాధ్యత అని ఆయన చెప్పారు. ఈ సమయంలో కొందరు నేతలు మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా జానారెడ్డి సీరియస్ అయ్యారు. తాను మాట్లాడే సమయంలో ఎవరూ అడ్డు రావొద్దన్నారు. తనను మాట్లాడకుండా అడ్డుకొంటే తాను సంతకం పెట్టి సమావేశం నుండి వెళ్లిపోతానని జానారెడ్డి చెప్పారు. దీంతో జానారెడ్డి మాట్లాడేవరకు పార్టీ నేతలు అడ్డు చెప్పలేదు. ఇదిలా ఉంటే జానారెడ్డి వ్యాఖ్యలకు మాజీ కేంద్ర మంత్రి Renuka Chowdhury సమర్ధించారు. పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకోవాలని ఆమె చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మధు యాష్కీ లు హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లాప్ షోగా విమర్శలు గుప్పించారు. స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడెక్కడ ప్రచారం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ను రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు బలి పశువును చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తే రేవంత్ రెడ్డి ప్రతిభ, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోతే సీనియర్ల తప్పిదమని రేవంత్ అనుచరులు ప్రచారానికి సిద్దమయ్యారని జగ్గారెడ్డి మంగళవారం నాడు వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. శతృవుకి శతృవు మిత్రుడు.. అందుకే ఈటల రాజేందర్ కు మద్దతిచ్చామన్నారు.ఈ పరిణామాలపై పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తానని ఆయన ప్రకటించారు.
2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీకి 61 వేల ఓట్లు వచ్చాయి.గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఇటీవలనే టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 వేల ఓట్లు పొందడంపై ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది.