మాదిగ జాతిని అంతం చేస్తారా..? కేసీఆర్‌పై మందకృష్ణ ఆగ్రహం

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 19, Sep 2018, 2:16 PM IST
manda krishna madiga fires on kcr
Highlights

తెలంగాణలో మాదిగ జాతిని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. నల్లాల ఓదెలుకు టికెట్ రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ గట్టయ్య మృతదేహానికి ఆయన ఇవాళ నివాళులర్పించారు. 

తెలంగాణలో మాదిగ జాతిని అంతం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. నల్లాల ఓదెలుకు టికెట్ రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ గట్టయ్య మృతదేహానికి ఆయన ఇవాళ నివాళులర్పించారు.

అనంతరం గట్టయ్య కుటుంబసభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గట్టయ్య మరణానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు..

అందోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు మోహన్‌ టికెట్‌ను జర్నలిస్టు అయిన మరో మాలకే ఇచ్చారని.. కానీ చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్న మాదిగ వ్యక్తి ఓదెలు టికెట్‌ను మాత్రం మాల వ్యక్తి ఎంపీ బాల్కసుమన్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, అవినీతి చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించి.. నిజాయితిగా ఉన్న ఓదెలుకు టికెట్‌ను నిరాకరించడంపై మందకృష్ణ మండిపడ్డారు. చివరకు సర్వేలోనూ అందరికంటే ముందున్నా ఓదెలుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు.

బాల్క‌సుమన్, ఓదేలు సీటు పోరులో గట్టయ్య బలి

ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి: మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత


 

loader