హైదరాబాద్ గణపతి ఉత్సవాలు జరుగుతున్న తీరుపట్ల నటి మంచు లక్ష్మి అసంతృప్తి ఉన్నారు.  కాలనీలు సమిష్టిగా ఉత్సవం జరుపుకునే విషయం ఆలోచించాలని ఆమె కోరుతున్నారు.

హైదరాబాద్ గణపతి ఉత్సవాలు జరుగుతున్న తీరుపట్ల నటి మంచు లక్ష్మి అసంతృప్తి ఉన్నారు. గణేశ్ విగ్రహాలు పెడుతున్న తీరులో భక్తి భావం కంటేపోటీ తత్వం పెరుగుతుూ ఉందని ఆమె ఆవేదనచెందారు.ఈ విషయాన్ని మంచు లక్ష్మి మునిసిపల్ శాఖ మంత్రికెటిఆర్ కు ట్వీట్ చేశారు. ఇష్ట మొచ్చినట్లు రోడ్ల మీద ఎవరికి వారు గణేశ్ మంటపాలు పెట్టుకోవటం కంటే, ఒక ప్రాంతంవారు సమిష్టిగా ఒక మంటపం ఏర్పాటుచేసుకుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. దీని వల్ల పర్వదినాన్ని సమిష్టిగా జరుపుకునే ఆరోగ్యకరమయిన వాతావరణం ఏర్పడుతుందని ఆమె కెటిఆర్ దృష్టికి తెచ్చారు.మట్లి వినాయక విగ్రహాలను ప్రోత్సహించినట్లే, గణేశ్ ఉత్సవాలను సమిష్టి సంబరంగా మార్చే మార్పుకోసం కూడా కృషి చేయాలని ఆమె కెటిఆర్ కు సూచించారు.

Scroll to load tweet…