హైదరాబాద్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఆదివారం ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది... ఆ వ్యక్తిని అడ్డుకున్నాడు.

అతని పేరు ఎండీ నజిరుద్దీన్‌గా తెలుస్తోంది. గత రెండు నెలలుగా పని లేకపోవడంతో కుటుంబం సాకలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా వ్యాపారం-ఆదాయం లేదని తెలిపాడు.

చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రభుత్వం తనలాంటి చిరు వ్యాపారులను  ఆదుకోవాలని నజిరుద్దీన్ కోరాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు అతను తెలిపాడు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.