Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో మరో సైబర్ మోసం: క్రిఫ్టో కరెన్సీ పేరుతో రూ. 33 లక్షల స్వాహా


హైద్రాబాద్‌లో మరో సైబర్ మోసం చోటు చేసుకొంది. క్రిఫ్టో కరెన్సీ పేరుతో రూ. 33 లక్షలను దోచుకొన్నారు. మోసపోయినట్టుగా గుర్తించిన ఓ వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Man Rs. 33 Lakh loses in cryptocurrency in Hyderabad
Author
Hyderabad, First Published Nov 14, 2021, 4:36 PM IST


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి క్రిప్టో కరెన్సీ తరహా కాయిన్ తయారు చేశానని నమ్మించి పలువురిని మోసం చేశాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కూడా ఈ తరహా మోసానికి ఎవరో ఒకరు గురౌతున్నారు.Hyderabad కు చెందిన వ్యక్తి క్రిప్టో కరెన్సీ కాయిన్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రమోట్ చేస్తానని ప్రచారం చేశాడు. దీంతో ఆ కాయిన్‌కు డిమాండ్ ఏర్పడుతుందని తన స్నేహితులతో కలిసి ప్రచారం చేయించాడు. ఈ మాటలను నమ్మిన కొందరు అమాయకులు  పెట్టుబడి పెట్టారు. 

పెట్టుబడి పెట్టిన వారికి  70 డాలర్లు అని చెప్పి 70 బినాకిల్ కాయిన్స్ రూపంలో సైబర్ చీటర్లు ఇచ్చి  మోసం చేశారు. తమ వద్ద నుండి రూ. 33 లక్షలను కాజేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మోసపోయిన బాధితుల్లో ఒకరు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.వారం రోజుల క్రితం హైద్రాబాద్ కు చెందిన కాంట్రాక్టర్ ను  మోసం చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ సహా పలువురిని నిందితుడు మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రూ. 86 లక్షలను నిందితుడు చీటింగ్ చేశారని పోలీసులు తెలిపారు. మోసం చేసిన వారిలో ప్రధాన నిందితుడు దీపు మొండల్ పరారీలో ఉన్నట్టుగా Rachakonda police ప్రకటించారు.

also read:సైబర్ క్రైం.. కేవైసీ పేరుతో ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగికే బురిడీ..

నిందితులు ఉపయోగించిన రూ. 50 లక్షల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొన్నారు. మొండల్ అనే వ్యక్తి 14 షెల్ కంపెనీలను ప్రారంభించి ఆ మొత్తంతోcryptocurrency ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం చేసుకొన్నాడు. ఈ విషయంలో నూర్ అలం హక్, ఎక్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇజారల్ సహాయం తీసుకొన్నాడని పోలీసులు గుర్తించారు.Mondal కు  హక్ అనే బ్యాంకు ఉద్యోగి సహకరించినట్టుగా పోలీసులు తెలిపారు. మొండల్ 64 బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.నిరక్ష రాస్యులకు చెందిన ఆధార్ కార్డులను తీసుకొని సిమ్ కార్డులను కొనుగోలు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. క్రిఫ్టో ఇన్వేస్టిమెంట్స్ పేరుతో బాధితులను  ఆకర్షించారు.

zebpay అనే యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించారని బాధితులను నమ్మించారని రాచకొండ పోలీసులు చెప్పారు.బెంగాల్ రాష్ట్రంలోని సిలిగిరికి వెళ్లి ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారుసైబర్ నేరాల విషయంలో పోలీసు శాఖ ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది. పోలీసులు చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా మోసగాళ్ల మాటలను నమ్మిన కొందరు అమాయకులు  లక్షలను కోల్పోతున్నారు.అనుమానాస్పదపు వ్యక్తుల నుండి ఫోన్లు, ఈ మెయిల్స్ లేదా ఇతరత్రా సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios