కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోసానిపేట మండలం పోసానిపేట వద్ద మంగళవారం నాడు మాజీ మావోయిస్టు  శిలాసాగర్ గాల్లోకి కాల్పులు. జరిపాడు. కుటుంబ కలహల నేపథ్యంలోనే శిలాసాగర్  కాల్పులకు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు.

కుటుంబసభ్యుల మధ్య గొడవలతో  శిలాసాగర్  కుటుంబసభ్యులను బెదిరించడానికి  తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కేసు నమోదు చేసుకొన్నారు. ఆయుధ లైసెన్స్‌ను దుర్వినియోగం చేశారని  శిలాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.