Asianet News TeluguAsianet News Telugu

బైక్ దొంగతనం.. నగ్నంగా నగర వీధుల్లో తిరుగుతూ హల్ చల్

అక్కడి నుంచి బేగంపేట లో షికార్లు కొట్టాడు. దీంతో... ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. పట్టుకోవడానికి ప్రయత్నించినా.. దొరకకుండా పారిపోయాడు.

Man naked and rides bike in Hyderabad
Author
Hyderabad, First Published Mar 11, 2021, 11:09 AM IST

ఓ వ్యక్తి బైక్ దొంగతనం చేశాడు. అక్కడితో ఆగాడా.. ఆ బైక్ పై నగ్నంగా... ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్లపై తిరగడం గమనార్హం. పోలీసులు అతనని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. దొరకకుండా పారిపోయాడు. కాగా.. ఈ నగ్న రైడర్ కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...గుర్తు తెలియని యువకుడు ఒకరు హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్రవాహనాన్ని చోరీ చేశాడు. ఈ ఘటనలో బాధితులకు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. దొంగతనం చేసిన తర్వాత ఆ బైక్ ని నగ్నంగా ఎక్కి.. నగరంలో పర్యటించాడు.

తొలుత తొలుత హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని బోయిన్‌పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్‌ ఏరియాలో హల్‌చల్‌ చేశాడు. ఆపై బొల్లారంలోని మిలటరీ ప్రాంతంలో సంచరించాడు. అక్కడి నుంచి బేగంపేట లో షికార్లు కొట్టాడు. దీంతో... ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. పట్టుకోవడానికి ప్రయత్నించినా.. దొరకకుండా పారిపోయాడు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వాహనాన్ని అక్కడే పడేసి వారిపై రాళ్ల దాడికి దిగాడు. అదను చూసుకుని పార్క్‌ లోపలికి వెళ్లిన అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సతన్‌నగర్‌ పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది రిజిస్టరై ఉన్న చిరునామా, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా అతడిని గుర్తించాలని ప్రయత్నించారు. 

అయితే ఆ వాహనం చోరీపై లంగర్‌హౌస్‌ ఠాణాలో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో సనత్‌నగర్‌ పోలీసులు వాహనాన్ని బుధవారం ఆ పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించారు. సదరు యువకుడి కోసం చోరీ కేసు ఉండటంతో లంగర్‌హౌస్‌ అధికారులు, న్యూసెన్స్‌ చేసినందుకుగాను మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌ కింద కేసు పెట్టాలని సనత్‌నగర్‌ పోలీసులు గాలిస్తున్నారు. 

మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. ప్రధానంగా లంగర్‌హౌస్‌ సహా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు నగ్నంగా బైక్‌ నడుపుతుండగా మిలటరీ ఏరియాలో వెనుక నుంచి వెళ్తూ కొందరు వాహన చోదకులు వీడియో తీశారు. కాగా.. అతనికి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios