హైదరాబాదు శివారు శంకర్ పల్లిలో దారుణం జరిగింది. మూడు వందల రూపాయలకోసం ఓ అపరిచిత వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

హైదరాబాద్ : వారిద్దరూ అప్పటికే పూటుగా liquor తాగారు. ఒళ్లు స్వాధీనంలో లేని స్థితికి చేరుకున్నారు. దీంతో సమాచారం అడిగిన ఓ వ్యక్తిపై attack చేశారు. అతని జేబులో నుంచి పడిన రూ.300, సెల్ఫోన్ కోసం అతడిని దారుణంగా బండరాయితో మోది murder చేశారు. ఈ సంఘటన గత నెల 25న హైదరాబాద్ లోని శంకర్ పల్లిలోని వడ్డెర స్మశానవాటికలో జరిగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్కు తరలించారు. శంకర్పల్లి సిఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మెట్పల్లికి చెందిన సాయిలు(35), మల్లేష్ (45) అన్నదమ్ములు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నారు. శంకర్ పల్లిలో నివాసముండే మల్లేష్ వద్దకు గత నెల 25న సాయిలు వచ్చాడు.

ఇద్దరూ కలిసి మద్యం తాగారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, చెరుకుపల్లికి చెందిన చెన్నయ్య (55) ఏదో సమాచారం కోసం వీరితో మాట్లాడాడు. వీళ్లు తాగిన మైకంలో అతడిని అకారణంగా కొట్టారు. ఆ సమయంలో చెన్నయ్య జేబులో నుంచి రూ.300, ఫోను కిందపడగా.. వాటిని సాయిలు, మల్లేష్ చూశారు. చెన్నయ్య వాటిని తీసుకొని వెళ్ళాడు. అతడిని వెంబడించి.. వెనక నుండి గట్టిగా పట్టుకుని.. స్మశానవాటికలో కి తీసుకువెళ్లి.. బండరాయితో మోది హత్య చేశారు. ఆ తర్వాత రూ. 300, ఫోన్ తీసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

ఇదిలా ఉండగా, ఒడిశాలో ఇలాంటి ఓ దారుణ ఘటన ఏప్రిల్ 13న వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు murderకు గురయ్యాడు. అయితే తనే ఈ హత్యలు చేశానంటూ ఓ వ్యక్తి వీడియోను రిలీజ్ చేశాడు. భూవివాదం కారణంగా తన అన్నయ్య కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసినట్లు మంగళవారం ఓ వ్యక్తి video ద్వారా అంగీకరించాడు. Odishaలోని కటక్ జిల్లా కుసుపూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

మృతులను అలేఖ్ సాహు (46), అతని భార్య రష్మీ రేఖ (41) కుమార్తె స్మృతి సంధ్య (19), ఇద్దరు మైనర్ కుమారులు స్మృతి సాహు (17), స్మృతి సౌరవ్ (16)గా గుర్తించారు. నిందితుడిని సిబా ప్రసాద్ సాహు (42)గా గుర్తించారు. నిందితుడు సిబా సాహుకు తన అన్నయ్యతో కొంత కాలంగా భూమి విషయంలో వివాదం ఉన్నట్లు సమాచారం. ఈ సమస్య మీదనే ఇద్దరు సోదరులు ఒక రోజు రాత్రి గొడవకు దిగారు. దీంతో మాటా మాటా పెరిగి సిబా మొత్తం అన్న కుటుంబాన్ని నరికి చంపాడు.

తన సోదరుడి కుటుంబాన్ని హత్య చేసిన తర్వాత, షిబా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన నేరాన్ని అంగీకరించాడు. సంఘటన గురించి వివరించాడు. ‘‘మా అన్నయ్య, అతని కుటుంబ సభ్యులు చాలా కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పట్టా భూమి విషయంలో వాగ్వాదం జరగడంతో అందరూ కలిసి నన్ను కొట్టారు. వాళ్ళందరూ గుమిగూడి నన్ను కొట్టడంతో నాకు ఏం చేయాలో తోచలేదు. దీంతో నేను వారందరినీ చంపాను. చట్టంలోని నిబంధనల ప్రకారం కోర్టు ఎలాంటి శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సిబా తెలిపారు.

తాను చేసిన తప్పును గుర్తించానని, జాజ్‌పూర్‌లోని బలిచంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని సిబా తెలిపారు.మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్‌ సమక్షంలో జరిగిన ఘటనపై పోలీసు బృందం విచారణ ప్రారంభించింది. కటక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జుగల్ కిషోర్ భానోత్ మీడియాతో మాట్లాడుతూ, భూవివాదాల వల్లే హత్యలకు కారణమని చెప్పారు.