Asianet News TeluguAsianet News Telugu

తల్లిని రాడ్డుతో కొట్టి, టూవీలర్ ఎక్కించి చంపి.. తలను గోడకు కొట్టుకుని కొడుకు ఆత్మహత్య..

ఉన్మాదిగా మారిన ఓ కొడుకు తల్లిని అతికిరాతకంగా హత్య చేసి.. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. 

man murder mother and committed suicide in kamareddy
Author
First Published Jan 14, 2023, 7:28 AM IST

కామారెడ్డి : తెలంగాణలోని కామారెడ్డి లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ  వ్యక్తి తల్లిని అతికిరాతకంగా హింసించి చంపాడు. ఆ తర్వాత  తాను కూడా అంతే హింసను అనుభవిస్తూ.. తలను గోడకేసి కొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన  శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 70 ఏళ్ల  చిటుకుల నర్సవ్వ గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు. చాలా ఏళ్ల క్రితమే ఆమె భర్త చనిపోయాడు. వీరికి కుమారుడు నర్సారెడ్డి(45) ఉన్నాడు.

అతను వ్యసనాలకు బానిస ఇంట్లో వారితో తరచుగా గొడవలు పడుతుండేవాడు. నర్సారెడ్డికి పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. వ్యసనాలకు బానిసవ్వడంతో వ్యసనాలకు బానిసవ్వడంతో భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా కొడుతుండేవాడు. దీంతో  నర్సారెడ్డికి దూరంగా వెళ్లిపోయారు. భార్యా పిల్లలు వదిలేసి వెళ్లిపోవడంతో నర్సారెడ్డి పిచ్చివాడిలా మారిపోయాడు. తల్లిని తరచుగా హింసించేవాడు. ఈ విషయంలో పెద్ద మనుషుల పంచాయతీలు కూడా జరిగాయి. 

పోస్ట్ మార్టం వద్దంటూ.. మృతదేహాన్ని భుజంమీద వేసుకుని పరుగో పరుగు..

శుక్రవారం నాడు కూడా నర్సారెడ్డి తల్లి దగ్గరికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. మొదట కట్టేతో కొట్టాడు. ఆ తర్వాత టూ వీలర్ ను ఆమెపైకి ఎక్కించి చిత్రహింసలు పెట్టాడు. రాడ్ కాల్చి వాతలు పెట్టాడు. అయితే ఇదంతా చూస్తున్న స్థానికులు మధ్యలో జోక్యం చేసుకోవడానికి భయపడ్డారు. దీనికి కారణం నర్సారెడ్డి ఉన్మాదిగా వ్యవహరించడమే. అందుకే అతనిని అడ్డుకునే సాహసం చేయక పోలీసులకు అతడి ప్రవర్తన మీద సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నర్సవ్వను అతని నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే నర్సవ్వ చనిపోయింది.  దీంతో ఆటోలో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తల్లి చనిపోవడన్ని చూసిన నర్సారెడ్డి తనతలను గోడకు బాదుకున్నాడు. హెల్మెట్తో  గట్టిగా కొట్టుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. అతను ఇంట్లోనే  చనిపోయాడు. ఈ మేరకు కామారెడ్డి గ్రామీణ సీఐ శ్రీనివాస్ గౌడ్ వివరాలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios