Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసికి క్షుద్రపూజలు చేయించిందని సొంత అక్కపై అనుమానం.. చివరికి..

ఫయీన్ బాగ్ కు చెందిన  మహమ్మద్ ఆరిఫ్ అలియాస్ షోయెబ్(32) ఓ యువతి జనవరిలో ప్రేమ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే యువతి తరచుగా అనారోగ్యానికి గురవుతుండడంతో ఆమె కుటుంబీకులు ముంబైలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు.
 

man murder his brother in law over Witchcraft allegations in hyderabad
Author
Hyderabad, First Published Nov 16, 2021, 8:42 AM IST

చాంద్రాయణగుట్ట :  జహానుమా ఫయీన్ బాగ్ లో యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు Homeguard, హత్యకు గురైన యువకుడికి సొంత బావ. ఫలక్ నుమా ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మహ్మద్ మజీద్, సీఐ ఆర్. దేవేందర్ తో కలిసి దక్షిణ మండలం డీసీజీ గజరావు భూపాల్ సోమవారం వివరాలు వెల్లడించారు.

ఫయీన్ బాగ్ కు చెందిన  మహమ్మద్ ఆరిఫ్ అలియాస్ షోయెబ్(32) ఓ యువతి జనవరిలో ప్రేమ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే యువతి తరచుగా అనారోగ్యానికి గురవుతుండడంతో ఆమె కుటుంబీకులు ముంబైలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు.

తిరిగి వచ్చిన తరువాత.. వారు అరిఫ్ బంధువులే Witchcraft చేయిస్తున్నారని బాబా చెప్పినట్లు తెలిపారు. అరిఫ్ nawab saheb kunta షాహీన్ నగర్ లో  నివసించే తన సోదరుని అనుమానించాడు. ఈ విషయమై 
Sister తో పాటు హుస్సేనీ ఆలం ఠాణాలో హోంగార్డుగా పని చేస్తున్న ఆమె భర్త మొహమ్మద్ సమీ మొహియుద్దీన్ (32) తో గొడవ పడ్డాడు.

అంతేకాదు ప్రేయసికి చికిత్స చేయించడానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని వారిపై ఒత్తిడి కు తీసుకువచ్చాడు. మేమేం చేయలేదని వారు చెప్పినా వినిపించుకోలేదు. వీడు వినేలా లేడని వారు రూ. 50 వేలు ఇచ్చిన అరిఫ్ ఊరుకోలేదు. దీంతో విసిగిపోయి Arif ను అంతం చేయాలని నిర్ణయించుకున్న హోంగార్డు సమీ.. తన సోదరుడు మహమ్మద్ అమ్జద్ మొహియుద్దీన్ (25), షాహీన్ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మహమ్మద్ అలీ (21),  అచ్చిరెడ్డి నగర్ కు చెందిన దుస్తుల వ్యాపారి అమేర్ మహ్మద్ ఖాన్ (26) తో కలిసి పథకం రచించాడు.

 ఈనెల 13న రాత్రి 11 గంటల ప్రాంతంలో గొడ్డలి, కత్తులతో దాడి చేసి పరారయ్యాడు.  కుటుంబీకులు అరీఫ్ ను ఉస్మానియాకు తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చనిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హోంగార్డు మహ్మద్ సమీని సర్వీసు నుంచి తొలగిస్తామని డీసీపీ తెలిపారు.

సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం, ఉద్రిక్తత

ఇదిలా ఉండగా.. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన  కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన సరూర్ నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్లు.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  ఆ ఫిర్యాదులో నిందితుడు ఆశామల్ల శ్రావణ్ కుమార్ గా పేర్కొన్నారు.

నిందితుడు శ్రావణ్.. గత కొన్ని నెలలుగా.. మైనర్ బాలికను వేధిస్తూ వస్తున్నాడు. దీంతో.. బాధిత బాలిక.. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో.. వారు శ్రావణ్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. మరోసారి తమ కుమార్తెను వేధించవద్దని కోరారు. అయితే.. నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు.  ఓ రోజు బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నిందితుడు ఆమెను కిడ్నాప్ చేశాడు.

అనంతరం బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లి.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక కనిపించడం లేదంటూ.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఆ కేసుకు సంబంధించి.. తాజాగా.. న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది. అతనికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios