తాను కట్టుకున్న భార్యను తన దగ్గరకు పంపడం లేదని భార్య కుుటంబంపై కక్ష కట్టాడు. ఎలాగైనా తన భార్యను తన వద్దకు తెచ్చకోవాలని అత్తారింటికి వెళ్లాడు. అడ్డుగా ఉన్న భార్య మామపై కాల్పులు జరిపాడు. ఈ దారుణ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇస్రాజ్ పల్లెలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెకు చెందిన బూరుగు గంగయ్య-సత్తవ్వల కూతురు మౌనిక, మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట శ్రీనివాస్ కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక పుట్టింటికి వచ్చింది. 

Also Read చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి..

అయితే, శ్రీనివాస్‌ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అత్తింటికి వచ్చి మౌనికతో గొడవపడసాగాడు. మౌనిక తన మేనమామ భైరం రాజిరెడ్డికి సమాచారం ఇచ్చింది. రాజిరెడ్డి వస్తుండగానే.. శ్రీనివాస్‌ వెంట తెచ్చుకున్న తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్‌ రాజిరెడ్డి కడుపులోకి, ఇంకోటి చేతి నుంచి దూసుకెళ్లాయి. భార్యాభర్తల మధ్య గొడవలో సర్ది చెప్పేందుకు వచ్చిన రాజిరెడ్డి.. బుల్లెట్ గాయాలకు గురై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

అయితే...స్థానికులు మాత్రం మరోలా చెబుతున్నారు. భార్య, భర్తల మధ్య సక్యత సరిగాలేదని ఈ క్రమంలో అతని భార్య పుట్టింటికి చేరిందని చెబుతున్నారు. ఈ క్రమంలో భార్యపై కాల్పులు జరుపుదామని వస్తే... మామ అడ్డుపడ్డాడని.. అందుకే ఆయనకు బులెట్ తగిలిందని చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు.