అతను ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత. గ్రామంలో డబ్బు, పలుకుబడి ఉన్న ఆయన కన్ను ఓ యువతిపై పడింది.  ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. యువతి గర్భవతి కాగానే... తనకేం సంబంధం లేదన్నాడు. అందరూ గోలపెట్టడంతో.. ఆమె శీలానికి వెలకట్టి డబ్బు ఇస్తానని చెప్పాడు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది కదా అని అందరూ కాంప్రమైజ్ కి రాగానే.. ఆ రాజకీయ నాయకుడు కొత్త కండీషన్స్ పెట్టడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన  ఓ నాయకుడు(49) అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(27) పై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది.

గర్భం దాల్చిన విషయం అతనికి చెప్పి ఆమె పెళ్లి చేసుకోమని అడిగింది. ఈ క్రమంలో సదరు యువతి ని కిడ్నాప్ చేసి వారం రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు నాయకుడిపై తమకు అనుమానం ఉందని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.

రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన యువతి ఇంటికి చేరింది. తనకు జరిగిన అన్యాయం మొత్తం తల్లిదండ్రులకు వివరించింది. దీంతో.. యువతి తల్లిదండ్రులు, తమ బంధువుల, గ్రామస్థులతో కలిసి దాడి చేయగా... నేరం చేసినట్లు సదరు నాయకుడు అంగీకరించాడు.

Also Read యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో.. శీలానికి వెలకట్టి...

అయితే.. పెళ్లి మాత్రం చేసుకోనని.. యువతిని గర్భవతిని చేసినందుకుగాను రూ.6లక్షలు ఇస్తానని బేరం కుదర్చడం గమనార్హం. ఆ డబ్బు ఇచ్చి.. వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా.. అని యువతి కుటుంబసభ్యులు కూడా సంధికి ఒప్పుకున్నారు. అయితే.. తీరా వాళ్లు ఒప్పుకున్నాక ఆ రాజకీయనాయకుడు కొత్త కండీషన్స్ పెట్టడం మొదలుపెట్టాడు.

సదరు యువతి అబార్షన్ చేయించుకున్న తర్వాతే డబ్బులు ఇస్తానంటూ మెలిక పెట్డడం గమనార్హం.దీంతో సదరు నేతపై యువతి కుటుంబసభ్యులు చెప్పులతో దాడి చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తుండటం గమనార్హం. అయితే.. తాము అదే గ్రామంలో ఉంటే ఎక్కడ ఏదైనా చేస్తారో అనే భయంతో  యువతి, ఆమె కుటుంబసభ్యులు గ్రామం వదిలేసి వెళ్లారట. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.