ఇంటికి పిలిచి మరీ మందు తాగించి.. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం గమనార్హం. 

వరసకు అన్న అవుతాడు కదా అని అడగగానే డబ్బు ఇచ్చింది. తీరా.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి పిలిచి మరీ మందు తాగించి.. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం గమనార్హం. ఈ సంఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బీదర్ ప్రాంతానికి చెందిన యువతి(26) నగరంలో ఉంటూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. కర్ణాటకలో ఉండే యువతి పిన్నికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు నిఖిల్(27) ఫిలింనగర్ పరిధి మహాత్మాగాంధీ నగర్ సమీపంలో నివసిస్తూ రాయదుర్గంలో టైలరింగ్ చేస్తున్నాడు.

ఏదో అవసరం ఉందని చెప్పి.. యువతి దగ్గర నుంచి రూ.50వేలు తీసుకున్నాడు. ఈ నెల 1వ తేదీన ఆ డబ్బు కోసం యువతి నిఖిల్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మందు కలిపిన కూల్ డ్రింక్ యువతితో తాగించాడు. ఆ తర్వాత మూడు రోజులకు డబ్బు కోసం ఫోన్ చేస్తే.. ఆమె నగ్న ఫోటోలను వాట్సాప్ లో షేర్ చేశాడు.

అంతేకాకుండా.. మత్తులో ఉన్నప్పుడు అత్యాచారం కూడా చేశానని.. డబ్బులు అడిగితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.