ఆదిలాబాద్ : కడెం ప్రాజెక్ట్ వద్ద యువకుడి గల్లంతు.. గాలింపు చర్యలు
ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు అతని కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్‌కు 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ఇప్పటి వరకు 2.4 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే స్పందించిన అధికారులు అతని కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. మరోవైపు.. కడెం ప్రాజెక్ట్ మరోసారి అధికారులు, ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ దిగువన వున్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతోంది.దీంతో వచ్చిన వరదను వచ్చినట్లగా 14 గేట్ల ద్వారా కిందకు వదులుతున్నారు.
అయితే ప్రాజెక్ట్‌కు మొత్తం 18 గేట్లు వుండగా.. అందులో నాలుగు మొరాయిస్తున్నాన్నాయి. దీంతో అధికారులు ఆ గేట్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీ సాయంతో ఓ గేటును తెరిచారు. మిగిలిన వాటిని కూడా సరిచేసే ప్రయత్నాల్లో వున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్‌కు 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ఇప్పటి వరకు 2.4 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు.