కామారెడ్డి:కామారెడ్డి జిల్లా భిక్కనూరులో  ఓ భర్త భార్యను  వివస్త్రను చేసి బయటకు గెంటేశారు. నగ్నంగానే పోలీ‌స్ స్టేషన్‌కు వెళ్లి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కుటుంబ కలహలతో కామారెడ్డి జిల్లా భిక్కనూరులో  ఓ భర్త తన భార్యపై అత్యంత దారుణంగా వ్యవహరించాడు. భార్యపై దాడి చేశాడు భర్త. అంతేకాదు ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. 

ఒంటిపై నూలు పోగులు లేకుండానే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు ఆమె ఒంటిపై బట్టలు కప్పారు.  భర్త పైశాచికత్వాన్ని చూసిన స్థానికులు  తీవ్రంగా మండిపడుతున్నారు.

భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.