భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతను అనుమానించాడు.ఈ క్రమంలో కట్టుకున్న భార్య తలను అతి దారుణంగా నరికేశాడు. అనంతరం ఆ తలను తీసుకువెళ్లి.. భార్య ప్రియుడిగా అనుమానిస్తున్నన వ్యక్తి ఇంటి ముందు పడేశాడు. ఈ దారుణ సంఘటన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..నారాయణఖేడ్‌కు చెందిన సాయిలు (50), చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. దాదాపు మూడు దశాబ్దాల వివాహ అనుబంధంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ సాఫీగానే సాగింది. అయితే తాజాగా భార్యకు ఎవరితో శారీరక సంబంధం ఉందనే అనుమానం సాయిలుకు వచ్చింది. అంతే.. బుధవారం అదును చూసి భార్య తలను గొడ్డలితో నరికేశాడు. అనంతరం ఆ తలతో 5 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వెళ్లి తన భార్యతో శారీరక సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు పడేశాడు.

నేరస్తుడు సాయిలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు