Asianet News TeluguAsianet News Telugu

ప్రేయసి భర్తను చంపేసి, తలను ఫ్రిడ్జ్ లో పెట్టి, ఆమెకు ఫోన్...

ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తి ప్రేయసి భర్తను హత్య చేశాడు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రేయసి భర్తను హత్య చేసిన తర్వాత తలను వేరు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు.

man kills fiance husband in Hyderabad in telangana
Author
Hyderabad, First Published Apr 6, 2021, 8:29 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేయసి భర్తను చంపేసి, తలను ఫ్రిడ్జ్ లో పెట్టాడు. నిందితుడిని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన సాధనాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.

మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం... గత నెల 30వ తేదీన సిద్దిక్ అహ్మదం తన భార్య రుబీనా బేగంతో పాటు పిల్లలను తీసుకుని శ్రీరాంనగర్ లోని బావమరిది ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత 12 గంటల సమయంలో సిద్దిక్ ఒక్కడే తిరిగి వచ్చాడు. అప్పటికే అతడి ఇంటి వద్ద మెకానిక్ సయ్యద్ మహ్మద్ అలీ కాపు కాస్తూ వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత మొదటి అంతస్థులోని సిద్దిఖీ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు అయితే తలుపులు తీయకపోవడంతో అక్కడి నుంచి బోరబండలోని తన నివాసానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 2 గంటల సమయంలో వచ్చాడు. 

లోపలి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్న స్పూన్ సాయంతో కిటికీ గ్రిల్స్ తీసి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత షాకబ్జార్వర్ తీసుుకని బోర్లా పడుకుని ఉన్నసిద్ధికి తలపై బలంగా మోదాడు. దీంతో సీద్ధిఖీ అక్కడికక్కడే మరణించాడు. 

ఆ తర్వాత సిద్ధిఖీ ఒంటిపై ఉన్న బనియన్ తీసి అతడి తలకు కట్టు కట్టాడు. అయినా రక్తస్రావం ఆగలేదు. దీంతో ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడితుందని భావించి తలను ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఆ తర్వాత మృతుడి భార్య రుబినాకు వాట్సప్ కాల్ చేసి భర్తను చంపిన విషయాన్ని చెప్పాడు. బెడ్రూంలోని రక్తం మరకలను శుభ్రం చేసి కిటీకి గ్రిల్స్ ను ఎప్పటిలాగే పెట్టేసి మృతుడి వాహనం తీసుకుని పారిపోయాడు. 

సీసీటీవీ ఫుటేజీ, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో అలీని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. అతనితో పాటు సిద్ధిఖి భార్య రుబీనాను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా అలీకి, రుబీనాకు మద్య అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఆ విషయం తెలియడంతో రుబీనాతో సిద్ధిఖీ గొడవ పడుతూ వస్తున్నాడు. రుబీనా ఆ విషయాన్ని అలీకి చెప్పింది. సిద్దిఖీని హత్య చేస్తానని అలీ చెప్పాడు. అయితే, వద్దని చెప్పి విడాకులు తీసుకుంటానని రుబీనా చెప్పింది. కొద్ది రోజులుగా వేధింపులు తీవ్రం కావడంతో అలీకి విషయం చెప్పింది. దాంతో అలీ సిద్దిఖీ హత్యకు పథకం వేసి హత్య చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios