హైదరాబాద్ : ప్రేమ పేరుతో ట్రాప్.. కిడ్నాప్ చేసి పదిరోజులుగా అత్యాచారం, ఆపై హత్య
హైదరాబాద్ మోకిలలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ప్రియుడు ఆమెను కిరాతకంగా హతమార్చాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆసిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మోకిలలో దారుణం జరిగింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ప్రియుడు ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఆసిఫ్ అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఈ క్రమంలో ఆమెను కిడ్నాప్ చేసి పదిరోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆసిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
అంతకుముందు హైదరాబాద్ చందానగర్‌లో దారుణం జరిగింది. కన్న తండ్రే ఐదేళ్ల కూతురిని కిరాతకంగా చంపాడు. స్కూల్‌లో వున్న తన పాప మోక్షితను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన చంద్రశేఖర్ పెన్సిల్ బ్లేడ్‌తో గొంతుకోశాడు. అంతేకాకుండా పాప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఓఆర్ఆర్‌లో కారుకు ప్రమాదం కావడంతో ఈ హత్యోదంతం వెలుగుచూసింది. కొన్నాళ్లుగా చంద్రశేఖర్ భార్యతో విడిగా వుంటున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.