మద్యం మత్తులో.. తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన కొడుకు

First Published 25, Jul 2018, 3:42 PM IST
man held for miss behaving with own mother
Highlights

 పీకల దాకా మద్యం సేవించిన రవిచందర్.. మరోసారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన సోదరిని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆ మానవ మృగం నుంచి తప్పించుకున్న తల్లి.. నెరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మద్యం మత్తులో ఓ వ్యక్తి వావి వరసలు మరిచిపోయాడు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 

రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న ఓ మహిళ(62)కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 47 ఏళ్ల కుమారుడు రవి చందర్ .. ఆఫీసర్స్ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జులై 21న రాత్రి అతిగా మద్యం సేవించి వచ్చిన రవిచందర్ తల్లితో గొడవ పడి ఆమెను దారుణంగా కొట్టాడు. అసభ్యకర పదజాలంతో తల్లిని దూషించాడు. 

జులై 22న మధ్యాహ్నం.. పీకల దాకా మద్యం సేవించిన రవిచందర్.. మరోసారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన సోదరిని పక్కకు నెట్టేశాడు. దీంతో ఆ మానవ మృగం నుంచి తప్పించుకున్న తల్లి.. నెరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవిచందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

loader