సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామంలోని జాతీయ రహదారిపై పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని నరికి చంపి దర్జాగా పారిపోయాడు. మృతుడిని ముషీరాబాద్‌కు చెందిన మహమూద్‌గా గుర్తించారు.

ఐదు నెలల క్రితం లక్డారంలో జరిగిన హత్య కేసులో ఇతను నిందితుడు. మహమూద్‌ని హత్య చేసిన వాళ్లు పాత నేరస్థులని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడికి, దుండగులకు మధ్య ఏమైనా పాత గొడవలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే కళ్లేదుటే ఓ వ్యక్తిని నరుకుతున్నా జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే గానే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. 

"