హైదరాబాద్ : మైనర్ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి పలు మార్లు అత్యాచారం చేసిన ఓ నిందితుడికి స్థానిక కోర్టు జీవితఖైదు వేసింది. 32యేళ్ల ఓ ప్లంబర్ 17యేళ్ల అమ్మాయికి మత్తుమందు ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

2015, ఆగస్ట్ 8న ఘట్ కేసర్ పోలీసులు ఈ మేరకు బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్నారు. ఆ ఫిర్యాదులో బాధితురాలు ఇలా రాసింది.. నిందితుడు అతడి ఇంట్లో పలుమార్లు తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని, దీంతో తాను ప్రస్తుతం గర్భవతి అయినట్టు పేర్కొంది.
బాధితురాలు.. నిందితుడి ఇంటి పక్కనే ఉండే అమ్మాయి. నిందితుడి భార్య పనిమీద బైటికి వెళ్లినప్పుడు అతను బాధితురాలిని ఇంటికి పిలిచేవాడు.. కాఫీలో మత్తుమందు కలిపి ఆమెతో తాగించేవాడు. ఆ తరువాత అఘాయిత్యానికి పాల్పడేవాడు అని పోలీసులు తెలిపారు.
అలా పలుమార్లు చేయడం వల్ల బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం కుటుంబసభ్యులు ఆమె ఏడునెలల గర్భిణి అయ్యేవరకు కానీ తెలుసుకోలేకపోయారు.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ లో ట్రయల్ పూర్తయింది. జడ్జ్ బి. సురేష్ ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతోపాటు పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు.
కాగా బాధితురాలి గుర్తింపును రహస్యంగాఉంచారు. వ్యక్తిగత రక్షణ, ప్రైవసీ రీత్యా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి గుర్తింపున గోప్యంగా ఉంచారు.