Asianet News TeluguAsianet News Telugu

ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో యువకుడి ఆత్మహత్య..

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్సిటీకి కొద్ది దూరంలో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.

man found dead near osmania university campus
Author
First Published Dec 27, 2022, 10:57 AM IST

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్సిటీకి కొద్ది దూరంలో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. యవకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడిని ఒరిస్సాకు చెందిన సుషిత్ జైన్‌గా గుర్తించారు. అతడు హబ్సిగూడలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టుగా తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉంటే.. మంచిర్యాలలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో చేసిన చిన్న పొరపాటు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. తాగిన మత్తులో ఓ వ్యక్తి తన ఇల్లనుకుని వేరే ఇంట్లోకి వెళ్లాడు. వారు అతడిని దొంగ అనుకుని చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. వివరాలు.. కాసిపేట మండలం దేవాపూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి మురళి (35) అనే వ్యక్తి తాగిన మత్తులో ఆదివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో భూమయ్య అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. అయితే అతడిని భూమయ్య కుటుంబసభ్యులు దొంగగా భావించారు. వెంటనే అతడిని కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని అరుపులు విన్న స్థానికులు.. అతడిని కాపాడి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ గాయాల కారణంగా చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం మురళి మరణించాడని వైద్యులు నిర్థారించారు. దీంతో పోలీసులు మురళి మరణానికి కారకుడైన భూమయ్య మీద హత్యానేరం నమోదు చేశారు. 

ఇక, మురళి దేవాపూర్ లోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. జగిత్యాలలోని ఎండపల్లి గ్రామంలో తండ్రి సంవత్సరీకానికి హాజరయ్యాడు. తిరిగి వెళ్లే సమయంలో కొండాపూర్ లోని ఓ మద్యం దుకాణంలో  మద్యం సేవించి బస్‌బేలో నిద్రించాడు.  తాగి ఉండడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మేలుకుని..నడుచుకుంటూ.. తన ఇల్లే అనుకుని భూమయ్య ఇంట్లోకి వెళ్లాడు. అదే అతడి మరణానికి కారణంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios