నల్లగొండ: భర్త వేధిస్తున్నాడంటూ భార్య ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా జరిగేది. కానీ, ఇక్కడ రివర్స్ అయింది. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

 కూతురు పుట్టినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదని ఆరోపించాడు. భార్య వేధింపులపై నల్లగొండ జిల్లా నకిరేకల్‌ జూనియర్‌ మున్సిఫ్‌ కోర్టులో రావుల భాస్కర్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశాడు. భాస్కర్‌ది అదే జిల్లాలోని ఊట్కూరు గ్రామం. 

సూర్యాపేట జిల్లా వెలుగుపల్లికి చెందిన రేణుకతో అతడికి 2015లో వివాహమైంది. అప్పటి నుంచి తనను తరచూ వేధింపులకు గురి చేస్తోందని భాస్కర్‌ సోమవారం కోర్టును ఆశ్రయించాడు. 2017 నుంచి తన భార్య కాపురానికి రాకుండా వేధింపులకు గురిచేస్తోందని పిటిషన్‌లో ఆరోపించాడు