హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయాలను నష్టపోయాడు. ఈ అప్పులు తీర్చే మార్గం కన్పించకపోవడంతో బలవంతంగా ప్రాణం తీసుకొన్నాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకొంది.

ఆన్ లైన్ గేమ్ లకు జగదీష్ బానిసగా మారాడు. ఈ గేమ్స్ ఆడేందుకు భారీగా అప్పులు చేశాడు.ఈ విషయం తెలిసిన తండ్రి కొడుకును మందలించాడు. ఆన్ లైన్ గేమ్స్ లో చేసిన అప్పుల్లో రూ. 16 లక్షలను జగదీష్ తండ్రి తీర్చాడు.

 

అయితే ఇంకా అప్పులు మిగిలి ఉన్నాయి. దీంతో వాటిని తీర్చేందుకు గాను జగదీష్  మళ్లీ ఆన్ లైన్ గేమ్స్ ఆడడం ప్రారంభించారు.  అప్పులు తీరలేదు.. పైగా ఇంకా అప్పులు పెరిగిపోయాయి.

also read:ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీసింది..!

దీంతో  చేసేదిలేక జగదీష్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్యకు ముందు జగదీష్ సెల్ఫీ వీడియో తీసుకొన్నాడు.ఈ వీడియోలో జగదీష్ ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.